సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పచ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ కార్యాలయంలో 12 మందికి రూ.14,25,243/- చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతోపాటే ఉంటుందని, అవసరమైన సమయంలో ప్రజలకు రిలీఫ్ ఫండ్ ద్వారా మంచి జరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపడతామన్నారు.