భారీ వాహనాలకు ప్రవేశం లేదు
WG: జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు హెచ్చరిక బోర్డులు గురువారం ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయంలో అనగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం లేదని అన్నారు. కావున వాహనదారుడు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.