వ్యర్ధాలను తొలగించండి మహాప్రభో..!

వ్యర్ధాలను తొలగించండి మహాప్రభో..!

GNTR: మండల కేంద్రమైన చేబ్రోలు హిందూ స్మశాన వాటిక పరిసరాల్లో అధికారులు వ్యర్ధాలతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. దీంతో అటువైపు నుంచి నిత్యం తమ సొంత పంట పొలాలకు వెళ్లే రైతులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అనేక వ్యాధులకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆదివారం కోరారు.