ప్రతీకార జ్వాల‌లో ‘సూపర్‌ గర్ల్‌’

డీసీ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ‘సూపర్‌ గర్ల్‌’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో మిల్లీ ఆల్కాక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తన కుటుంబాన్ని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సూపర్‌ గర్ల్ చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది.