మహిళా క్రికెట్ జట్టు విజయం గర్వకారణం: సీఎం

మహిళా క్రికెట్ జట్టు విజయం గర్వకారణం: సీఎం

AP: భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడం దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు. వారి అంకితభావం స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రికెట్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత జట్టు గెలుపుపై మంత్రి రాంప్రసాద్, శాప్ ఛైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన తెలుగు తేజం పి.కరుణకుమారిని ప్రత్యేకంగా అభినందించారు.