'నాణ్యమైన త్రాగునీటినే సరఫరా చేయాలి'

'నాణ్యమైన త్రాగునీటినే సరఫరా చేయాలి'

GNTR: మంగళగిరిలో నూరుశాతం నాణ్యమైన త్రాగునీటిని అందించాలని అదనపు మున్సిపల్ కమిషనర్ కె. శకుంతల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. త్రాగునీటి నాణ్యతను పరీక్షించడానికి కనీసం 50 శాంపిల్స్ సేకరించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ఖాళీ స్థలాల యజమానులకి నోటీసులు ఇవ్వాలన్నారు.