ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.2 నుంచి రూ.5
ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.2 నుంచి రూ.5 ఉంటుంది. మన దేశంలో లీటర్ పెట్రోల్ పోయించుకునే రూ.105తో ఇరాన్‌లో 25-30 లీటర్లు నింపుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఇరాన్ ఒకటి. వారి భూభాగంలోనే అపారమైన చమురు నిల్వలు ఉండటంతో వారు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అనేక దేశాలు చమురు అవసరాలు తీర్చుకోవడానికి 80% దిగుమతులపైనే ఆధారపడుతున్నారు.