నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయము
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవి మంజూర్ నగర్ లైన్ మరమ్మత్తులు శుక్రవారం చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. మరమ్మత్తుల కారణంగా జవహర్ నగర్, 5 ఇంక్లైన్ కమాన్,లారీ అడ్డా,మైసమ్మ కాలని, కలెక్టరేట్, వెంకటేశ్వర కాలని,మంజూర్ నగర్, బీసీ కాలని,వెంగల్ రావు, జీఎంఆర్ వెంచర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందన్నారు.