ఎమ్మెల్యేను సన్మానించి దళిత సంఘాల నేతలు

ఎమ్మెల్యేను సన్మానించి దళిత సంఘాల నేతలు

NRPT: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ బుధవారం దళిత సంఘాల నాయకులు దన్వాడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. దళితుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. దశాబ్ద కాలం జరిగిన పోరాటం ఫలించిందని చెప్పారు.