ఆరో రోజు సహస్ర పుష్పార్చన, శ్రీరామ హోమం
NLG: కట్టంగూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కల్యాణార్థం నిర్వహించిన శ్రీరామ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.