నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
SRPT: అనంతగిరి సబ్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఫీడర్ వద్ద చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సీతారామ్ తెలిపారు. ఖానాపురం గ్రామంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కరెంటు ఉండదని పేర్కొన్నారు. మరమ్మతు పనుల దృష్ట్యా వినియోగదారులు, రైతులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.