ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలి: అదనపు ఎస్పీ

ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలి: అదనపు ఎస్పీ

మెదక్: పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పోలీస్ పరేడ్‌ను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, ఫిట్‌నెస్, యూనిఫామ్ ప్రమాణాలపై పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో సిబ్బంది అంకిత భావంతో ఉండాలన్నారు.