యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు

SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలంలో యూరియా కోసం రెండు గంటల నుండి రైతులు పడిగాపులు కాస్తున్నారు.శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. నెల తరబడి యూరియా కోసం కష్టపడుతున్న తమ గోడును అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు.