ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక కళా వైభవం

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక కళా వైభవం

NTR: ద‌స‌రా శరన్నవరాత్రుల్లో 9వ రోజైన మంగ‌ళ‌వారం సకల లోకాల దుర్గతులను తొలగించే దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత కనకదుర్గమ్మ దర్శనమిస్తున్న శుభ తరుణంలో ఇంద్రకీలాద్రి దుర్గా నామస్మరణతో పులకించింది. ఈ సంద‌ర్భంగా శ్రీ కనకదుర్గానగర్‌లో దేవస్థానం కళావేదికపై ఉదయం సూరంపల్లి గ్రామానికి చెందిన రత్నకుమారి బృందం భజన సంకీర్తన, భక్తులను అలరించింది.