VIDEO: భీమవరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

W.G: భీమవరం 17వ వార్డులోని శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఆలయ కమిటీ పర్యవేక్షణలో అర్చకులు శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకాలు, తులసి పూజలు చేశారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈనెల 17న శ్రీ వేంకటేశ్వర స్వామివారి కథ, 19న అన్న సమారాధన ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.