కొయ్యూరులో భారీగా గంజాయి పట్టివేత

అల్లూరి: కొయ్యూరు మండలం బచ్చింత గ్రామ శివారులో అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన 26.6 లక్షలు విలువచేసే 532 కిలోల గంజాయి కొయ్యూరు పోలీసులు స్వాధీన పరుచుకున్నట్లు ఏఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ముందస్తు సమాచారంతో సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో కొయ్యూరు మంప ఎస్ఐలు రామకృష్ణ, లోకేష్ కుమార్ సిబ్బందితో దాడులు నిర్వహించి గంజాయి స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.