VIDEO: వైభవంగా ముగిసిన మల్లన్న జాతర
ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో గతవారం రోజులుగా కొనసాగుతున్న మల్లన్న జాతర ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశంతో ముగిసింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం నుంచి భక్తులు ప్రవేశించి వారి మొక్కులను సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తజనసంద్రంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.