ఏపీ ఎన్జీజీవో గజపతినగరం తాలూకా యూనిట్ ఎన్నికలు
VZM : గజపతినగరం ఏపీ ఎన్జీజీవో భవనంలో ఈ నెల 12వ తేదీన ఏపీ ఎన్జీజీవో గజపతినగరం తాలూకా యూనిట్ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి జె విక్టరు మంగళవారం తెలిపారు. 15పోస్ట్‌లకు ఈనెల 5వ తేది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ప్రవీణ్ కుమార్, ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాసరావు వ్యవహరిస్తారు.