ఊబిలో కూరుకుపోయి విద్యార్థి మృతి
ASR: జి.మాడుగుల ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కిల్లో ఫిలిప్స్ అనే విద్యార్థి శుక్రవారం సమీపంలోని గెడ్డలో ఈతకు వెళ్లి ఊబిలో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు పాడేరు GGHకు తరలించారు. బాలుడి మృతితో ఆగ్రహించిన బంధువులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.