నీటి కుంటలో పడి యువకుడి దుర్మరణం

నీటి కుంటలో పడి యువకుడి దుర్మరణం

KRNL: మండల కేంద్రమైన చిప్పగిరిలో బుధవారం సోమశేఖర్ (31) అనే యువకుడు నీటి కుంటలో పడి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే బహిర్భూమికి వెళ్లి జారి నీటి కుంటలో పడిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుందని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.