కవాడీగూడలోని దేవాలయానికి రాంచందర్ రావు

కవాడీగూడలోని దేవాలయానికి రాంచందర్ రావు

HYD: శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కవాడిగూడలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు స్వామిని దర్శించుకున్నారు. ఆపద్బాంధవుడు, కరుణామయుడైన ఆ భజరంగబలి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.