'లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి'
ELR: చింతలపూడిలో జరిగే మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి సి. మధుబాబు కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్అదాలత్ వినియోగించుకోవాలని సూచించారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, బీఎస్ఎన్ఎల్ రికవరీ, కుటుంబ తగాదాలు, మనోవర్తి, ప్రామిసరీ నోట్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని అన్నారు.