రాష్ట్ర పండుగగా భక్త కనకదాసు జయంతి
AP: భక్త కనకదాసు జయంతిని నవంబర్ 8న ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించనుంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరుకానున్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాసు సేవలు అనన్య సామన్యమని మంత్రి సవిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.