VIDEO: సర్పంచును సన్మానించిన ఎమ్మెల్యే
KNR: చొప్పదండి మండలం కోనేరుపల్లె సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. కేంద్ర ప్రభుత్వం 'సర్పంచ్ సంవాద్' యాప్ నిర్వహించిన 'క్రీడా మిత్ర పంచాయతీ' పోటీల్లో దేశంలోనే మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ రూపొందించిన వీడియోకు ఈ పురస్కారం దక్కింది. కరీంనగర్‌లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను సర్పంచు అభినందించారు.