రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

అనంతపురం: కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని నలబోయినపల్లి బస్టాప్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న అశోక్ రెడ్డి(22)మృతి చెందగా, మరో విద్యార్థి విష్ణు వర్ధన్ బాబు తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.