యాదగిరిగుట్ట ఆలయానికి రికార్డు ఆదాయం
TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1.04 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఈ ఒక్కరోజే స్వామివారిని 1,06,700 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే, ఆదివారం సెలవు దినం కావడం, కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.