పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ సిబ్బంది

NLR: తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం పంట పొలాలను సోమవారం ఆత్మ జిల్లా వనరుల కేంద్రం ప్రాజెక్టు అధికారులు వ్యవసాయ సిబ్బంది పరిశీలించారు. పంటలో నల్ల నక్కు, ఆకు నల్లిను గుర్తించారు. నల్ల నక్కు నివారణకు గాను ప్రొపికోనజోల్ 1 ml / 1 litre నీటిలో లేదా కాసుగామైసిన్ 2.5ml/1 లీటరు నీటిలో కలిపి పంట బాగా తడిచేటట్లు పిచికారి చేయాలని సూచించారు.