ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు ఎక్కువగా ప్రతిపక్షాల నిరసనలు, వాకౌట్‌లతోనే గడిచాయి. అయినప్పటికీ, ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు వంటి కొన్ని కీలకమైన చట్టాలను ఉభయ సభలు ఆమోదించాయి.