VIDEO: వైభవంగా పోలేరమ్మ తల్లి వార్షికోత్సవం
GNTR: ఫిరంగిపురం పట్టణంలోని తూర్పు బజారులో ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయంలో 103వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆలయ పరిసరాల్లో పొంగళ్ళు పెట్టి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.