మూసీ నది వరద ఉధృతిని పరిశీలించిన తహసీల్దార్ జ్యోతి

YDBNR: మోత్కూరు మండలం పొడిచేడు వద్ద మూసీ నది వరద ఉధృతిని తహసీల్దార్ జ్యోతి గురువారం పరిశీలించారు. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లరాదని, రహదారులు దాటేటప్పుడు వరద ప్రవాహాన్ని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.