పాఠశాలను సందర్శించిన కార్పొరేటర్
కరీంనగర్ కార్పొరేషన్ 14వ వార్డు పద్మనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ సందర్శించి, ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందించాలని సూచించారు. పాఠశాల మౌలిక వసతులపై డీఈవోతో చర్చించి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.