రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ASF: సిర్పూర్ (టి) మండలం సమ్మక్క-సారక్క దేవాలయం సమీపంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న 2 బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో బెస్తవాడకు చెందిన బాంనే రమేశ్ ఉన్నారు. స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.