కాణిపాకంలో నేడు ప్రదోష కాల పూజలు

కాణిపాకంలో నేడు ప్రదోష కాల పూజలు

CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మంగళవారం ప్రదోష కాల పూజలు నిర్వహించనున్నట్లు వరసిద్ధుడి ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రధాన ఆలయానికి అనుబంధమైన మరగదాంబిక సమేత వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ప్రదోష కాల పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.