'వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి'

KNR: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పకుండా తీసుకోవాలని సైదాపూర్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు తప్పకుండా మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయవద్దన్నారు. మండపాల నిర్వహణలో కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలాని పేర్కొన్నారు.