తేలు కుట్టడంతో యువకుడు మృతి
MHBD: గూడూరు మండలం వట్టేవాగు–చింతగట్టు సమీపంలో తేలు కుట్టడంతో చికిత్స పొందుతూ ఆదివారం యువకుడు మృతి. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా అడవిలో వంట చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండగా రెడ్యాల గ్రామానికి చెందిన కిన్నెర కృష్ణకుమార్‌ను తేలు కుట్టింది. అస్వస్థతకు గురైన యువకుడ్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.