నిజాంసాగర్ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత
KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.