VIDEO: శేష వాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

VIDEO: శేష వాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు శేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. మహిళలు కోలాటాల మధ్య స్వామి వారి ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.