శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకండి: సీఐ

JGL: రానున్న72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి సీఐ ఏలపాటి రాంనర్సింహరెడ్డి తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లల్లో నివసించేవారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు.