రెండు బస్సులు ఢీ.. ఆరుగురికి గాయాలు

రెండు బస్సులు ఢీ.. ఆరుగురికి గాయాలు

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి సమీపంలోని జాతీయ రహదారి-44పై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో కేరళకు చెందిన ఆరుగురు యువకులు గాయపడ్డారు. వినాయక నిమజ్జనం సందర్భంగా కావడి నృత్య ప్రదర్శన ఇచ్చి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరి బస్సు, ముందున్న మరో బస్సును ఢీకొంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.