VIDEO: లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం మూసివేత..!
ADB: జైనథ్ మండలంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచి ఈనెల 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయం మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ సంప్రోక్షణానంతరం పునర్దర్శనం ఉంటుందని వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.