ప్రియుడి వికృత చేష్ట.. ఆగిపోయిన పెళ్లి

ప్రియుడి వికృత చేష్ట.. ఆగిపోయిన పెళ్లి

ATP: మాజీ ప్రియుడి వికృత చేష్టతో ఓ యువతి పెళ్లి ఆగిపోయింది. అనంతపురం రూరల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె మాజీ ప్రియుడు పాత ఫొటోలను వరుడికి పంపాడు. దీంతో అతడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.