హైడ్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఎంపీ కౌంటర్
HYD: మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. HYD నగరంలో 600 చెరువులు ఉంటే గత BRS హయాంలో 44 చెరువులు మాయమయ్యాయన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, 360 చెరువుల్లో కబ్జాలను హైడ్రా తొలగించిందన్నారు.