చైన్స్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

చైన్స్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

ELR: భీమడోలు, చేబ్రోలు, నిడమర్రు, గణపవరం, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్స్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. నిందితుల నుంచి 65 గ్రాముల పసిడి వస్తువులను రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ.6,50,000 ఉంటుందన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.