ఎమ్మెల్యే గిడ్డి నేటి పర్యటన వివరాలు
కోనసీమ: నేడు పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 11 గంటలకు చిరుతపూడి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చారిత్రాత్మకత ఆదుర్రు బౌద్ధ స్తూపాన్ని ఎంపీ హరీష్‌తో కలిసి సందర్శిస్తారు. సాయంత్రం 4గంటలకు మాచవరం సొసైటీ వారోత్సవాల్లో పాల్గొంటారుని తెలిపింది.