కాటారంలో రోడ్లపై పశువులు సంచారం
BHPL: కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో పశువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే ఈ పశువుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.