ఈ నెల 20 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు
KMR: ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ పదోతరగతి, ఓపెన్ ఇంటర్ పరీక్షలను కామారెడ్డి జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల అన్ని శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ పది, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.