జిల్లా కేంద్రంలో రెండు రోజుల నిమజ్జనం

జిల్లా  కేంద్రంలో రెండు రోజుల నిమజ్జనం

జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్ర, శనివారాల్లో నిమజ్జనం వేడుకలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 340 మండపాలు ఏర్పాటు చేయగా.. తొలి రోజు 120, రెండో రోజు 220 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు చింతకుంట చెరువు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.