ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
NLR: లింగసముద్రం మండలంలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. జంపాల వారి పాలానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి వినయ్ బాబు స్నేహితులతో కలిసి సమీపంలోని జంగారెడ్డి పాలెం చెక్ డ్యాం వద్దకు వెళ్లారు. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యార్థి మరణించారు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.