జోగులాంబ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే..?

జోగులాంబ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే..?

GDWL: అలంపూర్‌లో తుంగాభద్ర నది ఒడ్డున వెలసిన జోగులాంబ అమ్మవారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవస్థానం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పురాణాల ప్రకారం సతీదేవి అవయవాలు పడి ఏర్పడిన శక్తి పీఠాలలో ఇదొకటి కాగా, ఇక్కడ ఆమె దంతాలు పడినట్లు విశ్వసిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.