రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్
JN: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో, అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున రేపటి గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.